ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి ఈరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విశాఖపట్నం జిల్లాలో శరభవరం, శృంగవరం, గాంధీనగర్, వై దొండపేట జంక్షన్, ఎర్రవారం మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగనుంది. సుమారు నెల రోజుల పాటు విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.
