ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. రోడ్డన్ని రక్తంతో తడిసి ముద్ద అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని పోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో 5 మంది చనిపోయారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనె వ్యక్తికి పక్షవాతం రావడంతో నాటు వైద్యం కోసం కుటుంబ సభ్యులతో విరుపాక్షపురంకు వచ్చి మందు తాగి ధర్మపురికి బయలుదేరారు. ఈ క్రమంలో పోడూరు వద్దకు రాగానే.. కుప్పం వైపు నుంచి ఓ లారీ వేగంగా వచ్చి వ్యాన్‌ను ఢీకొట్టింది. సంఘటన స్థలంలోనే రామ్మూర్తి, మోహన్, శేఖర్ మృతి చెందారు. తీవ్రగాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
