అతివేగం, సీటు బెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు మరో నలుగురు యువకులకు జీవనాధారం లేకుండా చేసింది. అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎగురుకుంటూ ఎదురుగా చెన్నై నుండి హైదరాబాద్ కి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్ గాయాల పాలయ్యారు. వీరి కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామగ్రితో పాటు కారు ధ్వంసమైంది. వీరిని కామినేని ఆస్పత్రికి తరలించి వైద్య సదుపాయం కల్పించారు.అయితే తమ జీవనాధారం అయిన ఫొటోగ్రఫీ సామగ్రి మొత్తం ధ్వంసమైందని,అందరు ఇక్కడ ఉన్నంత వరకు బాగానే చూసుకున్నారని,ఆ తరువాత తమనెవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు.