Home / ANDHRAPRADESH / కర్నూలు జిల్లాలో ఫస్ట్ నైట్ రోజే భార్యను భర్త నగ్నంగా చేసి దారుణం..!

కర్నూలు జిల్లాలో ఫస్ట్ నైట్ రోజే భార్యను భర్త నగ్నంగా చేసి దారుణం..!

దారుణం.. కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తగిలింది. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.కాని పెళ్లయి 24గంటలు గడవక ముందే భార్యకు నరకం చూపించాడు. ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వైరల్ చేసి పరువు తీస్తానని ఆమెను వేధించాడు. కొన్నాళ్లు టార్చర్ భరించిన బాధితురాలు విషయం అత్త చెవిలో వేసింది. అయితే.. కొడుకు చేసిన పనికి సిగ్గుపడాల్సిన అత్త.. కోడలినే వదిలించుకోవాలనుకుంది. అందరూ కలిసి చివరకు నవ వధువుకు టీబీ రోగం అంటగట్టారు. తమ కొడుకుకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన త్రివేణి, కర్నూలు జిల్లాకు చెందిన మాచాని రాజేంద్రప్రసాద్‌కు గత ఏడాది ఆగస్టులో వివాహమైంది. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో రూ.55లక్షల కట్నం ఇచ్చి త్రివేణి తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లయి 24గంటలు గడవక ముందే శాడిస్ట్ మొగుడు వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం మీడియాతో చెప్పి బాధితురాలు కన్నీరుమున్నీరయింది. కూతురు పడుతున్న నరకయాతన గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇదేంటని అత్తింటి వారిని నిలదీశారు. అయితే అప్పటికే అన్నింటికీ సిద్ధపడ్డ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు త్రివేణికి టీబీ ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేసి.. తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని కొత్త నాటకానికి తెరలేపారు. అయితే త్రివేణిపై పడ్డ నిందను చెరిపేందుకు కర్నూలు అపోలోకి ఆమెను తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు చేయించి.. టీబీ లేదని రిపోర్ట్‌లు కూడా తీసుకొచ్చారు. అయితే అప్పటికే తమ కొడుకుకు రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న రాజేంద్రప్రసాద్ తల్లిదండ్రులు త్రివేణి తండ్రి మాటను లెక్కచేయలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat