ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు సమచారం. ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి జరిగిన విశాఖ జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర కూడా జరుగుతుండటం గమనార్హం. దీంతో అప్రమప్తమైన పోలీసులు జగన్ కు పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో తనిఖీలు,సోదాలతో రక్షణ చర్యలను చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ రోజు మద్యాహ్నం 1 గంటకు తన క్వారీ వద్దకు వెళుతున్న అరకు ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను డుంబ్రీగూడా మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇదే జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు మరింత భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించారు. జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను అడిగి తీసుకున్న పోలీసులు ఆయా మార్గాల్లో పటిష్ట రక్షణ చర్యలు పాటించాలని, పూర్తి భద్రత కల్పించాలని నిర్ణయించారు. జగన్ రాత్రి వేళ బస చేసే ప్రాంతం వద్ద కూడా భద్రతను మరింత పెంచనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర 268 వ రోజు విశాఖ జిల్లాలో 268వ రోజు ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆనందపురం మండలం గండిగుండం క్రాస్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ క్రా స్, పాత్రుళ్లునగర్, రాయవరపువానిపాలెం గ్రామాల మీదుగా సరిపల్లి కాలనీ వరకు సాగనుంది. అయితే 269 వ రోజు జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో ముగిసి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించనుంది..300 వేల కీలోమీటర్లను జగన్ పాదయత్ర చేరుకుంటుంది.
