ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా.. తాజాగా … శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు… బాబూరావుకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు కె. రామ్మోహన్ నాయుడుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా… ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
