ఆంధ్ర్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మాకు ఇన్ని సీట్లు..వస్తాయి..మాకు అన్ని సీట్లు వస్తాయి అంటూ మీడియా ముందు చెబుతుంటారు. తాజాగా ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎందరో హామీలిచ్చారని, అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేవలం టీడీపీ మాత్రమే అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
