ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్… కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ను ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొత్ససత్యనారయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సూర్య నారాయణ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సామన్య ప్రజలకు, రేపటి తరానికి ఈ పాట మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి ప్రచారం చేశామని, ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏఏ కార్యక్రమాలు చేపడతామో.. ఈ పాట ద్వారా వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
