ఏపీలో ప్రస్తుతం అధికార టీడీపీలో అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలిరోజే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికులకు కాకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు టికెట్ ఇవ్వడంపై టీవీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు టికెట్‌ను తన కూతురికి కేటాయించాలని చంద్రబాబును టీవీ కోరారు. కానీ చంద్రబాబు ఆమెను కాదని అనితకు ఇచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన టీవీ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని రామారావు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులతో సమావేశమయ్యారు.
