వైసీపీ పెట్టినప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒకరు కడప జిల్లాకు చెదిన నేత డీఎల్. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నారు. విభేదాలను, శత్రుత్వాన్ని మరిచి గతంలో తాను తిట్టిన వైసీపీకి మద్దతు ప్రకటించారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామి రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డీఎల్ ను కోరారు. ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందని విమర్శించారు డీఎల్. ఏపీలొ అవినీతిమయమైన టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామంటున్నారు. జగన్ పై విశ్వాసముందని, అవినీతిరహిత పాలన అందిస్తారన్న నమ్మకంతో వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు.