ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్నా నేతలు మాత్రం బాబుపై నమ్మకం లేక వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కొత్త పల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి టీడీపీలోకి వెల్లారు. అనంతరం కాపు కార్పొరేషన్ ఛైర్మెన్‌గా నియమించారు బాబు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలో మనస్తాపానికి గురైన కొత్తపల్లి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు .కొత్తపల్లి సుబ్బారాయుడు కాసేపట్లో వైసీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌కు తన అనుచరులతో చేరుకున్న ఆయన జగన్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారు.
