మరో తొమ్మిది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. అయితే అదే గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తుందని, దాంతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని, ఏపీలో ఇప్పుడు అంతులేని సమస్యలు తాండవం చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో బాగాంగానే కడప జిల్లా రాయచోటి మండలం యండపల్లి గ్రామం పూసల కాలనీలో జిల్లా బిసి ప్రధాన కార్యదర్శి S. విజయ భాస్కర్ నియోజక వర్గంలో ప్రతి గ్రామంలోని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అందరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాలు గురించి తెలియజేస్తున్నారు. డ్వాక్రా మహిళలు గ్రామస్థులతో కలిసి పర్యటించారు. గ్రామస్థులు మాట్లాడుతూ బాబును నమ్మి మోసపోయామని తెలిపారు.వానలు రాక కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.బంగారు రుణాలు అన్నీ మాఫీ చేస్తామని తాళిబొట్లు తెంపారని చెప్పారు. అంతేగాక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తారని తెలిపారు. వృద్దులకు, వితంతువులకు పింఛన్లు3000 ఇస్తామని అన్నారు. దేశంలోనీ ఏ హాస్పిటల్ కీ వెళ్లిన1000రూపాయలు ఫైన ఎంత ఖర్చు అయినా జగన్ ఇస్తాడని చెప్పారు. డ్వాక్రా మహిళలకు “0” వడ్డీకే రుణాలు ఇస్తాడని తెలిపారు. మీ పిల్లలకు చదువుకు అయ్యే ఖర్చును మొత్తం భరిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సురేష్ కుమార్ రెడ్డి, కిషోర్, మహేష్ గ్రామస్థులు చెన్నకృష్ణ, రమణ, దర్బార్ తదితరులు పాల్గొన్నారు.