ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి.. చరిత్ర సృష్టించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతలు దారుణంగా ఓడిపోయారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరన్న నమ్మకంతోనే ప్రజలు వైసీపీని 175 అసెంబ్లీ సీట్లలో 150కిపైగా స్థానాల్లో గెలిపించారని వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు దోపిడీ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ఆయన పరిపాలన వద్దంటూ తమ తీర్పు ఇచ్చారని అంటున్నారు. అయితే అరకు టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్ కి చాలా అత్యంత దారుణమైన ఓట్లు వచ్చాయి. కిడారి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇదే ఏపీలో రికార్డ్. అంతేకాదు ఇదే స్థానంలో కూడ వైసీపీ ఘనవిజయం సాదించింది. దీనిబట్టి తెలుస్తుంది వైఎస్ జగన్ సునామీ ఏం రెంజ్ లో ఉందో
