కృష్ణా నదీ కరకట్ట పై వెలిసిన ఆక్రమణ నిర్మాణాల కూల్చివేత లో వైఎస్ జగన్ సర్కార్ దూకుడుగా ఉంది . ఇప్పటికే ప్రజావేదిక ను కూల్చివేసిన ప్రభుత్వం , తాజాగా రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, దుకాణాలు, ఇతర కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్‌కు చెందిన కార్ల షోరూమ్‌ను నేలమట్టం చేశారు. తరువాత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన భీమిలిలో క్యాంప్ కార్యాలయం, ద్వారకానగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇళ్లను కూల్చేయడానికి రంగం సిద్ధమైంది. దీంతో ఎక్కడ ఎవరి ఆక్రమకట్టడాలపై గురి పెడుతున్నారు తెలియడంలేదదని టీడీపీ నేతలు తమ వారితో చర్చించుకుంటున్నారంట. కృష్ణా నదీతీరంలోని ప్రజా వేదిక కూల్చివేతతో.. ప్రారంభమైన ఈ కూల్చివేత పర్వం… ఇప్పుడు విశాఖ మహానగరానికి చేరడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైయినట్లు తెలుస్తుంది.
