ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ విజయంతో ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించిన వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోటానికి జగన్ సాగించిన సుదీర్ఘ ప్రస్థానం , జగన్ నడుస్తున్న తీరు, సాగిస్తున్న పాలన నేడు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తినిస్తుందని చెబుతుండడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి నుండి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన సినీ నటి నవనీత్ కౌర్ కూడా ఈరోజు ఒక ఎంపీగా తాను ఎంపిక కావడానికి కారణం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తి అని పేర్కొంది. అంతేకాదు ప్రజలతో మమేకమవుతూ రాజకీయాలలో ముందుకు సాగాలన్న నీతిని తాను జగన్ ను చూసే నేర్చుకున్నానని నవనీత్ కౌర్ పేర్కొన్నారు . తెలుగు రాష్ట్రాల్లో పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పిన ఎంపీ నవనీత్ కౌర్ లోక్సభలో తెలుగురాష్ట్రాల సమస్యలకు తప్పకుండా మద్దతిస్తానంటూ పేర్కొన్నారు . ఆనతి కాలంలో దేశం దృష్టిని ఆకర్షించిన సీఎం జగన్ ఒక నవనీత్ కౌర్ మాత్రమే కాదు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న వారు, రాజకీయాల్లో జగన్ తరహా పోరాటాన్ని సాగించాలని భావిస్తున్న వారు , ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ తీరును మెచ్చుకుంటున్న వారు చాలా మంది ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తున్నారు. నిజంగా వైఎస్ జగన్ పాలన గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
