ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా కార్ల ప్రారంబోత్సవం హడావుడిగా చేశారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 8తేది కియా కారును ప్రారంబించనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబుతో కలసి ‘కియా’ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అర్హులైన స్థానికులందరికీ ‘కియా’ పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని మంత్రి శంకరనారాయణ చెప్పారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే తలంపుతో సీఎం వైఎస్ జగన్ ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు
