గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావ్ గారు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు.సోమవారం రాత్రికి అమెరికా బయలుదేరి వెళుతున్న ఆయన ఈనెల 28న తిరిగి వస్తారు. ఈ నెల 17వ తేదీ అమెరికాలోని డల్లాస్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవాస భారతీయులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈసమావేశం ను సమన్వయం చేసే బాధ్యత ను జగన్ మోహన్ రెడ్డి గారు యార్లగడ్డ వెంకట్రావు గారికి అప్పగించారు. దీంతో రేపు రాత్రి 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారితో కలిసి అమెరికా వెళ్తున్నారు. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్న దృష్ట్యా నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైన అవసరం వచ్చినా గన్నవరంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మరియు సిబ్బంది అందుబాటులో ఉంటారని కార్యాలయంలో సంప్రదించాలని వెంకట్రావు గారు సూచించారు.
