ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15 న కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు సమచారం. జగన్ తన తల్లి విజయమ్మ, భారతి, వాళ్ళ చిన్న కుమార్తె వర్షా రెడ్డితో కలిసి ఈ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ పర్యటన పూర్తిగా జగన్ వ్యక్తిగత పర్యటన అని చేబుతున్నారు. జగన్ చిన్న కూతురు హర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో సీటు వచ్చిందట. ఆమెని జాయిన్ చేయించేందుకే జగన్ కుటుంబం అమెరికా వెళ్తుందని చేబుతున్నారు. ఇప్పటికే జగన్ పెద్దకుమార్తె వర్షా రెడ్డి లండన్ లోని ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకుంటోంది. ఇప్పుడు చిన్న కుమార్తెకి యూఎస్ లో సీటు రావడంతో ఆమెను అక్కడ జాయిన్ చేసి రానున్నారు జగన్. ఈ నెల 20వ తేదీన ఆమె జాయినింగ్ ఉంటుందని చెబుతున్నారు. 24వ తేదీ వరకు అక్కడే ఉండి కూతురి వసతి ఏర్పాట్లు చూసుకోవడమే కాక ప్రవాసాంధ్రులతో కూడా కొన్ని సమావేశాలు పార్టీ ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. జగన్ వాషింగ్టన్ డీసీ, డల్లాస్ లలోని ప్రవాసాంధ్రులతో సమావేశం అవుతారని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తుంది.
