కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి కాన్వాయ్ వాహనం జిల్లాలోని ఆళ్లగడ్డ దగ్గర మంగళవారం ఉదయం బోల్తాపడింది. కడప ఎయిర్ పోర్టుకి వెళ్తుండగా ఆయనకు బందోబస్తుగా వెళ్తున్న కాన్వాయ్ వాహనం టైర్ పగలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజు క్షతగాత్రులయ్యారు. వీరిలో చంద్రయ్య పరిస్థతి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్‌రెడ్డి కుమారుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి సహాయక చర్యలు చేపట్టి వారిని మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో నంద్యాలకు తరలించారు.
