మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎం పికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు. అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో పారదర్శక పాలన చేసారు జగన్..
► అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’. చిన్న చిన్న సమస్యలకు 72 గంటల్లోనే పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు
► ‘స్పందన’లో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు.
► ప్రజా సమస్యలపై సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ అవుతున్నారు
► ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు
► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్. సీపీఎస్ రద్దుకు నిర్ణయించారు
► అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు.
► వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు ఈ ఏడాది డిసెంబరు 26న శంకుస్థాపన చేసారు
► పారిశ్రామిక పెట్టుబడుల కోసం.. అవినీతికి తావులేని, పారదర్శకమైన ఇండస్ట్రీయల్ పాలసీ. రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు
► అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు
► అమరావతిలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వాస్తవాల వెలికితీతకు చర్యలు చేపట్టారు
► గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసారు
► గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాల ఏర్పాటు చేస్తున్నారు.