నిరుద్యోగులకు శుభవార్త… నవంబర్ నెల లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 7 నుండి 17 వరకు 11రోజులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తునట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు సంబందిత అధికారులు దీనికి అర్హులని తెలియజేసారు. ఈ మేరకు ఆశక్తిగా ఉన్నవారు ఎవరైనా ఈ నెల 23నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. WWW.joinindianarmy.NIC.IN వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. దాదాపు 50వేలకు పైగా అభ్యర్ధులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
