Home / 18+ / ఆంధ్రరాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం.. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల ప్రారంభం

ఆంధ్రరాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం.. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల ప్రారంభం

మహాత్మాగాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి ఏపీలో అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. 73వ రాజ్యాంగ సవరణ మేరకు పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణచేస్తూ ప్రజలకు అన్నిసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చేందుకు రాష్ట్రంలో 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలను సీఎం ఏర్పాటుచేశారు.

 

ఒక్కో సచివాలయంలో 10 నుంచి 13రకాల ఉద్యోగాలిస్తూ ఇటీవల నియామకాలు పూర్తిచేశారు. సచివాలయ వ్యవస్థ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సచివాలయ భవనాలను ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. ఎప్పుడు కూడా చరిత్రలో 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలులేవు. గ్రామాల్లో 500 రకాల సేవలు అందుబాటులోకి తక్షణమే రానున్నాయి. ఈఘనత జగన్‌ కు దక్కింది. సొంత ప్రాంతంలో ఉద్యోగాలు లభించడంతో యువత పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే సంక్షేమ పథకాలు పొందే అవకాశం దక్కడం పట్ల యావత్ రాష్ట్రప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగన్‌ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat