రావమ్మా గౌరమ్మా అంటూ…ఆ గ్రామస్తులు అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు. ఇంతకు ఎక్కడా గ్రామం, ఎవరా గౌరమ్మా అనుకుంటున్నారు కధా.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో గౌరీదేవి జాతర జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిన్న ఆదివారం నాడు గ్రామస్తులు గౌరమ్మను డప్పులతో, ఆట పాటలతో, వేషదారణలతో ఎంతో కోలాహలంగా అమ్మవారిని ఆహ్వానించి గ్రామంలో ప్రతీ వీధిలో ఊరేగించారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ జాతరకు సంభందించి గ్రామస్తులు రెండుగా వర్గాలుగా విదిపోయు చిన్న గౌరమ్మా, పెద్ద గౌరమ్మగా పోటీగా జాతర చేస్తారు. ఈ జాతర నవంబర్ 7న నిర్వహిస్తారు. అంతేకాకుండా అమ్మవారిని ఆహ్వానించిన మొదలు జాతర రోజువరకు గ్రామం మొత్తం కాంతి వెలుగుల మధ్య ఉంటుంది. ఇరు వర్గాల వారు పోటాపోటీగా లైటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో ఎంత ఖర్చయినా వెనకాడరు.ఈ జాతర విషయంలో గ్రామా పెద్దలకు తోడుగా యూత్ మొత్తం సహకరిస్తారు. భక్తితో కొలిచే అమ్మవారు వారిని ఎల్లప్పుడూ మంచిగా చూసుకుంటుందని వారి నమ్మకం.