గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరటం ఖాయమవ్వటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అందుకు వంశీ సైతం సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేతకు ఈ సమాచారం ఇవ్వగా..అధికారికంగా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ పంపాల్సి ఉంది. వైసీపీలో చేరే ముందు ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, ఆమోదం పైన నిర్ణయం మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల మేరకు రాజనీమా ఆమోదం పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కాకుండానే.. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి అనుకుంటున్నారు.. కానీ గన్నవరం ఎన్నిక ఇప్పట్లో ఉండే అవకాశం లేదని సమాచారం.
