Home / ANDHRAPRADESH / టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..చోక్కాలు పట్టుకుని

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..చోక్కాలు పట్టుకుని

టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. పార్టీ వి స్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో తాజా, మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా.. ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు తన సొంత కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరిశీలకుడుగా బీటీ నాయుడు కార్యక్రమాలకు హాజరయ్యారు. మొదటగా ఉమా మహేశ్వర నాయుడు నిర్వహించిన సమావేశంలో పాల్గొని.. మధ్యాహ్నం 3.30 గంటలకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఉన్నం వర్గీయులు ఆర్‌కే రాజు, ఆర్‌కే అలెగ్జాండర్, మాజీ సర్పంచ్‌ శ్రీరాములు, షామీర్, నారాయణ, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున తెలుగు యువత నాయకుడు కిశోర్, వెంకటేశులు తదితరులు సమావేశానికి హాజరైన బీటీ నాయుడును చుట్టుముట్టి నిలదీశారు.

ఒక్కసారిగా అందరూ గళం విప్పడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ వ్యవస్థను నియమించకపోయినా ఇన్‌చార్జ్‌గా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉన్నం వర్గీయులను పార్టీకి దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమా మహేశ్వర నాయుడిని పంపితే అందరూ కష్టపడి పనిచేశామని, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా గాలి ఉండటంతో 151 చోట్ల ఓడిపోయామన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఓడించారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నం హనుమంతరాయ చౌదరికి టికెట్‌ రానప్పుడు తామంతా అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను సంప్రదిస్తే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడుతానని, ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఉన్నం హనుమంతరాయ చౌదరికి సముచిత స్థానం ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. ఉన్నంతో పాటు ఆయన వర్గీయులను పార్టీకి దూరం చేసే దుష్ప్రచారాలు జరుగుతున్నాయని వాపోయారు.

కంబదూరు మాజీ సర్పంచ్‌ శ్రీరాములు స్పందిస్తూ పార్టీలోకి చంద్రబాబు కన్నా తామే ముందు వచ్చామని, మా తర్వాతే చంద్రబాబు టీడీపీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి స్పందిస్తూ పార్టీ కోసం పనిచేస్తే కొందరు ఉన్నం హనుమంతరాయ చౌదరికి టికెట్‌ రాకుండా అడ్డుకున్నామని.. పార్టీ అభ్యర్థి గెలిచినా, ఓడినా తమకేమీ సంబంధం లేదని మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం బీటీ నాయుడు స్పందించి పారీ్టలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని, సమస్య పరిష్కారానికి అధినేత దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat