Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్..ప్రముఖ నటుడు

సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్..ప్రముఖ నటుడు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్‌. నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్‌. నారాయణమూర్తి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ…‘ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్‌ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార‍్పొరేట్‌ సూళ్లలో చదవిస్తున్నారు. మా తరంలో ఇంగ్లీష్‌ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారు’ అని వ్యాఖ్యలు చేశారు.