Home / LIFE STYLE / మీరు లావు అయిపోతున్నారా..బీ అలర్ట్…!

మీరు లావు అయిపోతున్నారా..బీ అలర్ట్…!

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల నేపథ‌్యంలో మెజారిటీ శాతం వ్యక్తులు ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఒంటి బరువు పెరిగిపోతున్న కొద్ది హైబీపీ, షుగర్ వంటి వ్యాధులు ఎటాక్ అవుతాయి. తద్వారా హార్ట్‌బీట్‌కు, పక్షవాతానికి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయని మనం తరచుగా చదువుతుంటాం..అయితే తాజాగా ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే..ఎక్కువ బరువు పెరుగుతుంటే..చావును త్వరగా రమ్మని స్వయంగా ఆహ్వానించడమేనని యూఎస్‌కు చెందిన ప్లాస్ మెడికల్ జర్నల్ తెలిపింది. ఇటీవల యూ ఎస్‌కు చెందిన శాస్త్రవేత్తలు స్థూలకాయంతో బాధపడుతున్న 9500 మంది వ్యక్తులతో పాటు మూములు బరువే ఉన్న మూడు లక్షల మందికి సాధారణ వ్యక్తులపై దాదాపు 20 వేర్వేరు అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాలు వెలువరించి అంశాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఈ అధ్యయనాల్లో తేలింది. బరువు పెరిగిపోవడమే మరణాలకు నేరుగా కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే కలకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి రోజు కడుపు నిండా తినడమే కాకుండా వాకింగ్, జాగింగ్‌, యోగా వంటివి చేస్తూ…శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం ఎందుకైనా మంచిది. ఓకేనా