ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలులో “థ్యాంక్యూ సీఎం జగన్ సర్” కార్యక్రమం నిర్వహించారు. ఏపీలోనే మొదటిసారిగా కర్నూలులో వినూత్నరీతిలో సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని ప్రమాణం చేశారు. ప్రభుత్వ పథకాలను అంతఃకరణ శుద్ధితో ప్రజలకు అందేలా పాటు పడతామని ప్రతిజ్ఞ బూనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ ఆశయమని పేర్కొన్నారు. వార్డు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు జగనన్నకు రెండు కళ్లు లాంటివారని చెప్పారు. ప్రతి వార్డు పరిధిలో పార్టీలకు అతీతంగా బాధ్యతగా ప్రజలకు సేవలందించాలని హఫీజ్‌ఖాన్ సూచించారు.
