ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2020 గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన రాత్రి 7.40 గంటలకు పాల్గొంటారు.
