టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నతీరు చూస్తే గుండె రగిలి పోతోందని,అసెంబ్లీ కాకపోతే తడాకా చూపించేవాళ్లమని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కరణం ధర్మశ్రీ, జక్కంపూడి రాజా తదితరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే రక్తం ఉడికిపోతోందని జక్కంపూడి రాజా అన్నారు. ఇది అసెంబ్లీ అని ఓపిక పట్టామని, లేకుంటే తాము ఏమిటో చూపించేవారమని అన్నారు. టీడీపీ వారు గత ఐదేళ్లు దున్నపోతుల్లా దోచుకుతిన్నారని ,అందుకే వారిని ప్రజలు ఓడించారని అన్నారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ మేము ఓపికతో టీడీపీ ఎమ్మెల్యేల దూషణను భరిస్తున్నామని, కాని అవి హద్దులు దాటుతున్నాయని, తాము కూడా తడఖా చూపగలమని ఆయన అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని అన్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ను ఏడాది పాటు సస్పెండ్ చేశారని , ఇప్పుడు టీడీపీ వారిపై మాత్రం చర్య తీసుకోరా అని ఆయన అన్నారు.
