Home / ANDHRAPRADESH / 300 యూనిట్లు కరెంట్ దాటితే పింఛ‌న్‌ తీసేస్తారా అని అడుగేవాళ్లకి స‌మాధానం

300 యూనిట్లు కరెంట్ దాటితే పింఛ‌న్‌ తీసేస్తారా అని అడుగేవాళ్లకి స‌మాధానం

సగటున భారతీయుడు వినియోగించే కరెంటు నెలకు 90 యూనిట్లు (4 ట్యూబ్‌లైట్లు, 4 సీలింగ్‌ ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిజ్‌ ఉన్న ఇంటికి సగటున భారతదేశంలో గృహాలకు నెలకు 90 యూనిట్లు ఖర్చు అవుతుంది) అయితే గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో క‌రెంటు వినియోగం 200 యూనిట్లు దాటితే పింఛ‌న్ ఇచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు 300 యూనిట్లు వ‌ర‌కు పెంచారు. గ‌తంలో కుటుంబానికి రెండు ఎక‌రాల లోపు మాగాణి, 5 ఎక‌రాల మెట్ట క‌లిగిన వారు అర్హులు కాగా. ప్ర‌స్తుతం 3 ఎక‌రాల లోపు మాగాణి, 10 ఎక‌రాల‌లోపు మెట్ట భూమి లేదా మాగాణి మ‌రియు మెట్ట భూమి క‌లిపి 10 ఎక‌రాల లోపు ఉన్న వారంద‌రూ అర్హులు. గ‌తంలో గ్రామీణ ప్రాంతాల్లో నెల‌కు రూ.5000లోపు ఆదాయ ప‌రిమితి ఉన్న‌వారు అర్హులైతే, దానిని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రూ.10,000ల‌కు పెంచింది. గ‌తంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నెల‌కు రూ.6000లోపు ఆదాయ ప‌రిమితి ఉన్న‌వారు అర్హులైతే దానిని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రూ.12000ల‌కు పెంచింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు / పింఛ‌న్ దారులు అన‌ర్హులు అయితే పారిశుద్ధ్య కార్మికుల‌కు మిన‌హాయింపు.ఫోర్ వీల‌ర్ ఉన్న‌ కుటుంబాలు అన‌ర్హులు (ట్యాక్సీ ఆటో, ట్రాక్ట‌ర్‌కు మిన‌హాయింపు) కేజ్టుంబంలో ఏ ఒక్క‌రైనా ఆదాయ ప‌న్ను చెల్లించిన‌ట్లైతే ఆ కుటుంబాలు అన‌ర్హులు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఆస్తులు లేనివారు / 750 చ‌.అ లోపు మాత్ర‌మే ఇళ్లు క‌లిగిన వారు అర్హులుగా న్యాయంగా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat