ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అమ్మాయిల హాస్టల్లో మంచం కింద ఓ అబ్బాయి దాక్కుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజులుగా ‘ఫెస్ట్’ నిర్వహిస్తున్నారు. అందరూ ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో అదే ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నఅబ్బాయి ..అమ్మాయి హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఒక రోజు మొత్తం అదే హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది. హాస్టల్లో అబ్బాయి దూరిన విషయం తెలిసిన తర్వాత కూడా అందులో ఉన్న విద్యార్థినులు ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లలేదు. అయితే ఎలాగో అనోట ఈ నోట పాకి మేనేజ్‌మెంట్‌కు సమాచారం వచ్చింది. ఆ హాస్టల్ గదికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. ఆ అబ్బాయి హాస్టల్ లోపలే ఉన్నాడని భావించిన సెక్యూరిటీ సిబ్బంది గునపంతో తలుపు తాళాలు పగలగొట్టి చూశారు. లోపలకు వెళ్లిన తర్వాత అన్ని మంచాలను పక్కకు జరిపి చూశారు. ఓ మంచం కింద పడుకొని దాక్కున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. అబ్బాయి మీద యాక్షన్ తీసుకోనున్నారు.