కోవిడ్ –19 నివారణా చర్యలకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలు ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలుసుకుని విరాళాలు సమర్పించారు. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల ఎండీ పీ.వీ. కృష్ణారెడ్డి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు. కరోనా వైరస్ నివారణకు విజయవాడకు చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం సహా బోధన, బోధనేతర సిబ్బంది కలిపి రూ.1.3 కోట్ల విరాళాన్ని అందించారు.
దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు సిద్దార్థ విద్యాసంస్థల కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు అందించారు. విజయవాడ వైయస్సార్‌సీపీ నాయకుడు దేవినేని అవినాష్, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పాల్గొన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా విరివిగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందుతున్నాయి.