నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్.చిరంజీవి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29వ తేదీ రాత్రి అతను పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. 11 గంటల సమయంలో కనకమహాల్ సెంటర్ వద్ద నిలబడి ఉండగా సెక్స్‌వర్కర్ మధుమతి అతనితో మాట కలిపింది.
వ్యభచరించడానికి అతన్ని ఒప్పించి కనకమహాల్ థియేటర్ సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు చిరంజీవిని తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ఆమె సహచరుడు మస్తాన్ సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు కలిసి చిరంజీవిపై దాడి చేసి అతని వద్దనున్న రూ.30 వేల నగదును దోచుకెళ్లారు. గాయపడిన చిరంజీవి ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని లోలోపల మదన పడసాగాడు. శనివారం తన స్నేహితుడికి జరిగిన విషయాన్ని చెప్పడంతో అతని సహాయంతో మూడోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.