ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 233వ రోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పారుపాక క్రాస్ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు.ఇప్పటి వరకు ఆయన 2685 కిలోమీటర్లు నడిచారు. ఈనెల 14 న విశాఖ జిల్లాలోకి జగన్ పాదయత్ర అడుగు పెట్టబోతుంది.
