టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకరరెడ్డి చేసిన బూటు నాకుడు వ్యాఖ్యలకు హిందూపూరం వైసీపీ ఎంపి ,మాజీ పోలీసు అదికారి గోరంట్ల మాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక అమరవీరుడైన పోలీస్ బూటును తుడిచి, ముద్దాడి జేసికి తన నిరసన తెలిపారు. పోలీసుల బూట్లు అంటే యుద్దంలో ఆయుదాలు అని ఆయన అన్నారు.తనపై మీసం మెలేశారని, దాంతో తాను ఎంపి అయ్యానని మాదవ్ పేర్కొన్నారు. పోలీసులను తిట్టి జేసి పతనావస్థకు చేరారని ఆయన అన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ అవకాశమిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి పోలీసుగా మారుతానని ఆయన ప్రకటించారు. పోలీసులు అహర్నిశలు ప్రజల కోసం పని చేస్తున్నారని, దివాకర్ రెడ్డికి రక్షణ కల్పిస్తున్నది పోలీసులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మాదవ్ అన్నారు.
