ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 95వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన ప్రజాసంకల్పయాత్రను పెద్దఅలవలపాడు నుంచి ప్రారంభించారు వైఎస్ జగన్. అయితే ఈ పాదయాత్రలో బాగంగా అనంతపురం జిల్లా డీఆర్‌డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కర్నూలు జిల్లాకు చెందిన తలారి రంగయ్య వైసీపీలో చేరారు.
see also..”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
94 వరోజు బుధవారం పొన్నలూరు మండలం తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో పాల్గొని జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రంగయ్య 21 సంవత్సరాలుగా గ్రూప్–1 సర్వీసులో పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు నచ్చక పదవీ విరమణ చేసినట్లు తెలిపారు. వైసీపీలో చేరుతున్నవారిలో తలారి రంగయ్య అనంతపురం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అలూరి సాంబశివారెడ్డి, బాలినేని తదితరులు ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 1275.9కిలో మీటర్లు నడిచారు.
see also..ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
See Alsoఏపీ మాజీ సీఎస్ కు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు ..ఆ దేవుడే దిక్కా ..!