ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది. వైఎస్ జగన్ తోపాటు అడుగులో అడుగు వేయ్యడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు.
see also..వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!
ప్రజలు భారీ సంఖ్యలో జగన్ వెంట కదిలారు. ‘ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ నిరంతరం శ్రమిస్తున్నాడని తెలుసుకొని పూణే నుంచి వచ్చాం. జననేత జగన్ వెంట నడవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది మేము మా కళ్లతో చూశాము. మేము అడుగులో అడుగు వేశాం.ఇలాగే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం’ అని మేకలశ్రీనివాసులు యాదవ్ తదితరులు చెప్పారు.
see also..పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన బిగ్ ఫైట్..వీడియో వైరల్