అది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందికి లభించిన హామీ. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇచ్చిన మాట. దానిని ఈ రాష్ట్రప్రభుత్వం ‘ఉద్దేశపూర్వకంగా’ మరచిపోయిన రోజున.. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని రోజున.. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఒకే ఒక్క గళం డిమాండ్ చేసింది. ‘ప్యాకేజీలతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మా హక్కు’అని అది నినదించింది. .ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరవని, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావని, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, పక్క రాష్ట్రాలతో పోటీ పడలేదని ఒకే ఒక్క గొంతు ప్రజల్లో చైతన్యం కలిగించింది. అది మరెవరో కాదు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇపుడు 5కోట్ల గొంతులు ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నాయి. అనేక పార్టీలు జాతీయ స్థాయిలో కూడా ఒకే తాటిపైకి వస్తూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టాలని చూసినా.. ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అందుకు కారణం వైఎస్ జగన్ నాలుగేళ్లుగా చేస్తున్న దీక్షలు, పోరాటాలే.
మరోపక్క ..
ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పలుమార్లు పలు విషయాలపైన చంద్రబాబు నాయుడు మాటలు మార్చుతున్నా… ప్రత్యేక హోదా విషయంలో నిలకడగా నాలుగేళ్లుగా వైఎస్ జగన్ చేసిన పోరాటం వల్లే ఇపుడు జాతీయ స్థాయిలోనూ కదలిక వచ్చింది. ప్రత్యేక హోదా అనే ఒక లక్ష్యం కోసం ప్రజలను అనునిత్యం చైతన్యపరచడమే కాక జాతీయస్థాయిలో రాజకీయ పక్షాలను ఏకం చేసి కేంద్రంలో కూడా కదలిక రావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. జగన్‌కు నాకు పోలికా.. జగన్‌తో నన్ను పోలుస్తారా అని మీడియాను ఈసడించిన ముఖ్యమంత్రే చివరకు ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ను అనుసరించాల్సి వచ్చిందని విశ్లేషకులంటున్నారు. కొన్ని కోట్ల మెదళ్లను కదిలించారు కాబట్టే జగన్ బాటలోకి వచ్చి ప్రత్యేక హోదా కోసం నిలబడక తప్పని పరిస్థితి చంద్రబాబుకు వచ్చిందన్నది నిర్వివాదాంశమని వారు పేర్కొంటున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానమైనా, ఎంపీల రాజీనామాల నిర్ణయమైనా వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగమే.