Home / ANDHRAPRADESH / అస‌లు కార‌ణం ఇదే..!!

అస‌లు కార‌ణం ఇదే..!!

అస‌లు కార‌ణం ఇదే..!! ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను హ‌వాలా ద్వారా క‌ర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమ‌రావ‌తి నిర్మాణానికి చెందిన ఈ న‌గ‌దును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న స్వార్ధ రాజ‌కీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని నిర్మాణం పేరిట నిధుల‌ను దోచుకున్న చంద్ర‌బాబు, త‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడు సీబీఐ ఎన్‌క్వైరీ వేస్తుందో అని క‌ల‌వ‌ర‌ప‌డుతున్న చంద్ర‌బాబు మ‌ళ్లీ త‌న కుఠిల రాజ‌కీయాల‌కు ప‌దును పెట్టారు. అందులో భాగంగానే క‌ర్ణాట‌క‌కు రూ.వెయ్యి కోట్ల న‌గ‌దు పంపిణీ. ఇంత‌కీ చంద్ర‌బాబు ఏపీకే క‌దా ముఖ్య‌మంత్రి…? మ‌రి క‌ర్ణాట‌క‌కు రూ.1000 కోట్లు ఎందుకు హ‌వాలా చేసిన‌ట్లు అనేగా మీ డౌట్‌. మీ డౌట్ అదే అయితే, ఈ స‌మాధానం మీ కోస‌మే అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

see also : రైల్వేశాఖలో మరో 20,000 ఉద్యోగాలు..మొత్తం లక్ష పదివేలు..!

ఆ వార్త సారంశాన్ని ప‌రిశీలించి చూస్తే.. వివ‌రాలిలా ఉన్నాయి..!!

అయితే, రాజ‌కీయాల్లో 40 ఏళ్ల అనుభ‌వం ఉంద‌ని చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఉన్నన్ని కేసులు మ‌రే రాజ‌కీయ నాయ‌కుడిపై లేవ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. అంతేకాకుండా, సీఎం చంద్ర‌బాబు దుస్తులు మార్చినంత సుల‌భంగా పార్టీల‌తో పొత్తులు కూడా మార్చ‌గ‌లుగుతార‌న్న పేరు ఉంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. విభ‌జ‌న త‌రువాత ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించే బాధ్య‌త నాది, న‌న్ను ముఖ్య‌మంత్రిని చేస్తే కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాడైనా స‌రే ప్ర‌త్యేక హోదా సాధించి తీరుతా అని చెప్పిన చంద్ర‌బాబు తీరా అధికారం చేప‌ట్టాక హోదా వ‌ద్దు.. ప్ర‌త్యేక ప్యాకేజీ ముద్దు, కోడ‌లు మ‌గ బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటాదా..!! వంటి సామెత‌లు చెప్తూ ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప‌క్క‌న‌పెట్టేసి, ప్ర‌త్యేక ప్యాకేజీ గ‌ళ‌మెత్తారు సీఎం చంద్ర‌బాబు. అయితే, తాజా రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీతో చంద్ర‌బాబు ర‌హ‌స్య భేటీ అయ్యార‌ని, త్వ‌ర‌లో వీరి మ‌ధ్య పొత్తు కుదిరే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల కాలంలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఇప్పుడు ఆ వార్త‌ల‌నే నిజం చేస్తూ మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మే 12న క‌ర్ణాట‌క‌లోని అన్ని అసెంబ్లీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈసారి ఎలా అయినా క‌ర్ణాట‌క‌ను సొంతం చేసుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే, కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులో భాగంగానే, కాంగ్రెస్ ప్ర‌చారం నిమిత్తం అమ‌రావ‌తికి చెందిన వెయ్యి కోట్ల రూపాయ‌ల నిధుల‌ను క‌ర్ణాట‌క‌కు చేర‌వేశార‌ని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. అయితే, ఈ హ‌వాలా వెనుక టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, గ‌ల్లా అరుణ‌కుమారి ఉన్నార‌ని పేర్కొంటున్నారు. అయితే, 2014 సంవ‌త్స‌రంలో గ‌ల్లా జ‌య‌దేవ్ కంపెనీల‌కు సీబీఐ నోటీసులు పంపించ‌డం, అలాగే, కాంగ్రెస్‌తో గ‌ల్లా అరుణ‌కుమారికి త‌త్సంబంధాలు ఉండ‌టంతో ఈ వార్త‌కు మ‌రింత బ‌లం చేకూరింద‌న్న‌ది సోష‌ల్ మీడియా స‌మాచారం.