ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు.
