టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్‌కళ్యాణ్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. ఆయన పేరులో ఉన్న కళ్యాణ్ ఉంటే నిత్య పెళ్ళి కుమారుడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
