ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్ జగన్ చూసి టీడీపీ నేతలకు వణుకు మొదలైయ్యింది అంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడం. ఇందులో కొంతమంది మంత్రి పదవులు కూడా ఇవ్వడం అప్పట్టో ఒక పెద్ద సంచలనం. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ ఇప్పటికి పోరాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అయితే తాజాగా వైసీపీ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సునీల్‌కుమార్ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాదు టీడీపీ నేతలు 40 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంటా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
