Breaking News
Home / ANDHRAPRADESH / టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోలకు ఎదురుగానే రాసలీలలు

టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోలకు ఎదురుగానే రాసలీలలు

టీడీపీ సీనియర్‌ నాయకుడు, మహా విశాఖ నగర టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి నెల్లి సాధూరావు అభం శుభం తెలియని ఓ బాలికతో రాసలీలలు జరిపిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. గాజువాక కైలాస్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోల సాక్షిగా మనమరాలి వయసున్న బాలికతో అశ్లీలంగా ప్రవర్తించిన దృశ్యాల వీడియో కలకలం రేపుతోంది. డాక్‌యార్డ్‌లో పనిచేసి రెండేళ్ల కిందటే రిటైర్‌ అయిన సాధూరావు.. 30 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ స్థానిక అధికార ప్రతినిధిగా, జన్మభూమి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. వివిధ ప్రభుత్వ పథకాల పేరుతో అమాయక యువతులపై వల వేయడం, పార్టీ కార్యాలయానికి రప్పించి ప్రలోభపెట్టడం, శారీరకంగా లోబర్చుకోవడం కొన్నేళ్ల నుంచి రివాజుగా మారిందన్న ఆరోపణలున్నాయి. కార్యాలయంలో బెడ్‌ ఏర్పాటుచేసుకోవడంతో పాటు.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ మాదిరి మార్చుకున్నాడు. పక్కా ఆధారాలతో ఆయన బండారాన్ని బట్టబయలు చేయాలనుకున్న కొందరు ఆయన రాసలీలలను వీడియో తీసి మీడియాకు పంపారు. పక్కా ఆధారాలతో వీడియో బయటికొచ్చినా ఫిర్యాదు లేనందున తాము చర్యలు తీసుకోలేమని పోలీసులు చెబుతున్నారు. కనీసం సుమోటోగా కూడా కేసు నమోదుచేయలేమని గాజువాక సీఐ రామారావు స్పష్టం చేశారు. 24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే మహిళా సంఘం తరఫున పోరాటం చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి హెచ్చరించారు.