Breaking News
Home / ANDHRAPRADESH / వైసీపీ సోషల్ మీడియాపై పవన్‌కల్యాణ్‌ పోలీసులకు ఫిర్యాదు

వైసీపీ సోషల్ మీడియాపై పవన్‌కల్యాణ్‌ పోలీసులకు ఫిర్యాదు

తమ పార్టీపై సోషల్ మీడియాలో అధికారంలో ఉన్న వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ సోషల్‌ మీడియా విభాగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, లీగల్‌ నోటీసులు పంపుతామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.