Home / 18+ / పల్నాడులో ఏం జరిగింది.. ఉదయం నుంచి జగన్ చంద్రబాబు ఏం చేసారు.? చలో ఆత్మకూరు దేనికి దారి తీసింది.? డీజీపీ

పల్నాడులో ఏం జరిగింది.. ఉదయం నుంచి జగన్ చంద్రబాబు ఏం చేసారు.? చలో ఆత్మకూరు దేనికి దారి తీసింది.? డీజీపీ

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గత కొద్దిరోజుల కిందట ఘర్షణలు జరిగాయి. దీనికి ఏ విధమైన రాజకీయాలు కాకపోయినా దీనికి రాజకీయ రంగు పులిమారని ప్రభుత్వం చెప్తుండగా అసలు ఈగొడవకు కారణం మీరంటే మీరే అని రెండు పార్టీల జిల్లా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ బాధితుల పునరావాస శిబిరం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ఓ శిబిరం ఏర్పాటుచేసింది. ఆ శిబిరంలో ఉన్నవారిని పరామర్శించడానికి వెళ్తానని చంద్రబాబు ప్రకటించి ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహావేశానికి లోనయ్యారు.

 

గత ఐదేళ్లుగా చంద్రబాబు అండతో యరపతినేని, కోడెల కుటుంబాలు పల్నాడును పట్టి పీడిస్తూ డబ్బులు దండుకుంటూ అనేక అక్రమాలకు పాల్పడి ప్రజల్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలు పెడతారా అంటూ తాముకూడా పోటీగా టీడీపీ దాడుల బాధితులతో కలసి పల్నాడు వెళ్తామంటూ వైసీపీ కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, ఇతర టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. పోలీసులు ఇంటినుంచి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటి బయటకు రాకుండా పోలీసులు గేట్లు మూసేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వీరితో పాటే టీడీపీ, వైసీపీలకు చెందిన పలువురు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మొత్తం 144సెక్షన్ విధించారు. విజయవాడలోనూ గస్తీ పెంచారు. పల్నాడులో లో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు

 

. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, భూమా అఖిలప్రియ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న సహాకొందరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు గృహనిర్బంధంలో ఉన్నారు. అలాగే వైసీపీ నాయకులను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని కూడా మాచర్ల వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా పార్టీ కార్యాలయం వద్ద ఆళ్ల బైఠాయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పోలీసులపై తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మకూరు వెళ్తానని, ఇంత దుర్మార్గపు, రాక్షస పాలన ఎక్కడా చూడలేదన్నారు. వైసీపీ నాయకులూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం శిబిరం పెయిడ్ ఆర్టిస్టులతో ఏర్పాటు చేశారనీ, అందులో స్థానికులు లేరని మంత్రి బొత్స, ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి విమర్శించారు.  పల్నాడు అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైసీసీ గురజాల ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి విమర్శించారు. పల్నాడులో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు ఎన్నో దాడులుచేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. అయితే విపక్ష నేత చంద్రబాబు పర్యటనతో పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండడం, శాంతి భద్రతలకు భంగం కలుగుతుండడంతో ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

 

అంతే కానీ, ప్రభుత్వంపై ఆయన పోరాడుతున్నారన్న కారణంతో అదుపులోకి తీసుకోలేదన్నారు. అయితే గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీపీ బాధితుల శిబరం నుండి బాధితుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని ఆర్డీఓ భాస్కర్ రెడ్డి ప్రకటించారు. శిబిరంలో ఉంచిన కొందరిని స్వగ్రామాలకు పంపించామని, బాధితులు చెప్పిన సమస్యలను రికార్డు చేసుకున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామాలలో దాడులు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఇరువర్గాలతో మాట్లాడి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఉదయం నుంచీ బిజీ బిజీగా గడిపారు. ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖకు ఆదేశాలిచ్చేసి తాను ఉన్నతాధికారులతో సమావేశాలు వరుసగా నిర్వహించారు. అక్టోబరు 2 న గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభానికి  సన్నాహాలపై, స్కూళ్లను అభివృద్ధి చేయడంపై, ఇసుక విధానంపై. ప్రభుత్వ టీచర్లకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ పై సీఎం సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు చేసారు.