Home / 18+ / తన అరెస్ట్ జరిగితే ఆందోళన చేయాలన్న చింతమనేని స్కెచ్ ను భగ్నం చేసిన ఖాకీలు

తన అరెస్ట్ జరిగితే ఆందోళన చేయాలన్న చింతమనేని స్కెచ్ ను భగ్నం చేసిన ఖాకీలు

మాజీ విప్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు దుగ్గిరాలలో అరెస్ట్ చేశారు. చింతమనేనిపై ఉన్న అట్రాసిటీ కేసుల కారణంగా ఆయన ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తూ గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా తాను పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన చింతమనేని తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

అయితే తన అరెస్ట్ జరిగితే ఆందోళన చేయాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్న చింతమనేని అనుచరుల పీఎస్ కు వెళ్లేసరికి ఆయన అక్కడ లేరని తెలుస్తోంది. మరోవైపు చింతమనేని ప్రభాకర్‌‌ను అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ చేపట్టినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అలాగే బుధవారం ఉదయం చింతమనేని ఇంట్లో పోలీసులు సోదాలు కూడా నిర్వహించగా ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు సోదాలంటూ పోలీసులను నిలదీశారు. అయితే అరెస్ట్ జరిగితే తనను ఉంచిన స్టేషన్ ముందు ఆందోళన చేయాలన్న చింతమనేని స్కెచ్ ను పోలీసులు భగ్నం చేసి వారి కస్టడీలో ఆయనను ఉంచినట్టు సమాచారం.