Home / ANDHRAPRADESH / మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు…!

మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు…!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసులో దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దాడిశెట్టి రాజాను ఆరో నిందితుడిగా చేర్చారు.