Home / ANDHRAPRADESH / అసెంబ్లీలో చంద్రబాబుకు శ్రీవాణి “స్వీట్” కౌంటర్

అసెంబ్లీలో చంద్రబాబుకు శ్రీవాణి “స్వీట్” కౌంటర్

ఏపీ అసెంబ్లీ రెండోరోజూ కొనసాగుతోంది.. సభలో ఉల్లిపాయలపై అధికార విపక్షాల మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మాజీసీఎం చంద్రబాబు లేచి ఉల్లివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈక్రమంలో సీఎం జగన్ లేచి ఉల్లిపాయలపై దేశం మొత్తం వివాదం నడుస్తోంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉల్లి రూ.25కి ఇస్తున్నామని ఇందుకు చాలా గర్వంగా కూడా ఉందన్నారు. మీ హెరిటేజ్ మాదిరిగా రూ.200కి అమ్మడం లేదనన్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ హెరిటేజ్ మాది కాదని, హెరిటేజ్ ను ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేసామన్నారు. దీంతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి లేచి చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని, మీ కోడలు బ్రహ్మణి నాకు దీపావళి పండుగకు గిఫ్ట్ గా హెరిటేజ్ స్వీట్స్ పంపించారు. ఇప్పుడు చెప్పగలరా హెరిటేజ్ మీది కాదు అని అన్నారు.