Home / ANDHRAPRADESH / నారా లోకేష్ అమెరికా వెళ్లింది ఇందుకేనా…90 శాతం నిజం ఇదే

నారా లోకేష్ అమెరికా వెళ్లింది ఇందుకేనా…90 శాతం నిజం ఇదే

అసెంబ్లీలో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారని.. కానీ లోకేశ్‌ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్‌ ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని అర్థమవుతోందన్నారు. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా అని నిలదీశారు.